శ్రీ సూర్య నారాయణ స్తోత్రం
శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవ చూడామణి
ఆత్మరక్షా నమః పాపశిక్షా నమో విశ్వ కర్తా నమో విశ్వ భర్తా
నమో దేవతా చక్రవర్తి పరబ్రహ్మ మూర్తి త్రిలోకైక నాధాధినాధా
మహా భూత ప్రేతంబులన్ నీవెయై బ్రోవుమేల్లప్పుడున్ భాస్కరహస్కర
పద్మినీ వల్లభా వల్ల కీ గానలోలా త్రిమూర్తి స్వరూపా
విరూపాక్ష నేత్రా మహా దివ్య గాత్రా అచిన్త్యావతారా
నిరాకారధీరా పరాకయ్య ఓ అయ్య తాపత్రయాభీల దావాగ్ని
దుర్ధన్త నిర్ధూత నిస్సార గంభీర సంభావితానీక నేకంబులన్ దాకి
ఏకాకినై జిక్కి ఏ దిక్కునన్ గానలేకుండా నున్నాడ నీవాడనో తండ్రి
నీ జాయమాన కటాక్షంబు చేతన్ నన్ను వీక్షించి వేగన్ కృపాదృష్టి చేతన్
మునీన్ద్రాది వంద్యా జగన్నేత్ర మూర్తి స్వరూపుండ వయ్యుండి
ఛండా సుసారధ్యమున్ గంటి యశ్వమ్ము తానంటి చక్రమ్ము
మార్తాన్డుడై చండవారాక్షసా దీశులన్ గాంచ కర్మానుసుద్యోగ
దోషమ్ములన్ ద్రుంచి కీర్తి ప్రతాపంములన్ మించి మీదాసులన్ గాంచి
ఇస్టార్ధముల్ ఇత్తువొ ద్రుస్టివేల్పా మహాపాప కర్మాలకున్ ఆలయంబైన
ఈ దేహ భారంబు భారంబు కానీకు సర్వోత్తమా నా ఒప్పులన్ తప్పులన్
నేరముల్ మాని సహస్రామ్శుడా పట్టి నీ కీర్తి కీర్తింప నే నేర్తునా ద్వాదశాత్మ
దయాళు త్వమున్ జూపి నా ఆత్మ ఖేదంబులన్ బాపి పోషిమ్పనీవంతు
నిన్నున్ ప్రశంశింప నాసేష భాషాధిపుల్ గానగాలేరు నీ దివ్యరూప
ప్రభావంబు గానంగ నేనెంత నెల్లప్పుడున్ నేను స్వల్ప జీవుండను
నీచున్డను మహా కష్టున్డను నిష్ట యున్ లేదు నీపాద పద్మమ్ములే సాక్షి
దుశ్చిత్తమున్ బాపి నిశ్చిన్తుగన్ జేయవే కామితార్ధ ప్రదాయకా
మహేంద్రాయ కీర్తిన్చినన్ మహా జన్మ జన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్
పోయి,కామ్యార్ధముల్ కొంగు బంగారు తంగెడుజున్నైఫలంబనుచు నిల్చున్
మహాదేవదేవ శ్రీ సూర్య దేవా నమస్తే నమస్తే నమస్తే నమః
శ్రీ ఉష చాయ పద్మిని సంజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ దేవతార్పణమస్తు