సుభద్ర సారె
సోలతో సొమ్ముల్లు ఇస్తిరి కాని చోద్యంపు చీరల్లు పెట్టిర మీవాళ్ళు
తవ్వతో సొమ్ముల్లు ఇస్తిరి గాని తల్లంటు గిన్నెల్లు పెట్టిర మీవాళ్ళు
మానికతో సొమ్ముల్లు ఇస్తిరి గాని మడిగట్ట చీరల్లు పెట్టిర మీవాళ్ళు
అడ్డతో సొమ్ముల్లు ఇస్తిరి కాని అరణంపు ఆవుల్ని తోలిర మీవాళ్ళు
కుంచంతో సొమ్ముల్లు ఇస్తిరి కాని కుడువ పళ్ళేలైనా పెట్టిర మీవాళ్ళు
మావాళ్ళు పేదవాళ్ళు మాకేమి కలదు పెట్టే వారిళ్ళల్లో పెళ్లాడ రాదా
నా మాట కెదురు మాట లాడుతావాని పాండవ మధ్యముడు ఫక్కున తన్నే
గోలుగోలు కన్నీరు గోడపై నొలికె కానావతి కన్నీరు కళ్ళంట జారే
మానావతి కన్నీరు మడమల్ల జారే బోరని కన్నీరు బొడ్డల్లా జారే
కంటి కాటుక తీసి ఓ భరిణ నుంచి ఒంటి నగలు తీసి ఓ భరిణ నుంచి
ముద్దుల మూటడిని చంక నెత్తుకుని గంటల కాముడిని వెంట పెట్టుకుని
వెళ్ళింది సుభద్ర అన్న వాడలకు శ్రీ కృష్ణ సత్యాల ఇంటి ఛాయలకు
వంటింట్లో వారి వదిన చల్ల చేయంగ నట్టింట్లో వారి అన్న నిద్రపోవంగా
నిద్రేల పోయావు నీల వర్ణుడ నీచేల్లెలొచ్చినది నిద్ర మేలుకో
ఇది ఏమే చెల్లెలా ఇటుల వచ్చావు మొగము చూడ ఏదో కలత చెందేవు
సోలతో సొమ్ముల్లు ఇచ్చి నారుట చోద్యంపు చీరల్లు పెట్టలేదుట
తవ్వతో సొమ్ముల్లు ఇచ్చినారుట తల్లంటు గిన్నేల్లు పెట్టలేదుట
మానికతో సొమ్ముల్లు ఇచ్చినారుట మడిగట్ట చీరల్లు పెట్టలేదుట
అడ్డ తో సొమ్ముల్లు ఇచ్చినారుట అరణంపు ఆవుల్ని తోలలేదుట
కుంచంతో సొమ్ముల్లు ఇచ్చినారుట కుడువా పళ్ళా లైనా పెట్టలేదుట
మావాళ్ళు పేదవాళ్ళు మాకేమి కలదు పెట్టేవారిళ్ళ ల్లో పెళ్లాడ రాదంటే
నామాట కేదురుమాట ఆడుతావాని పాండవ మధ్యముడు పక్కున తన్నే
పెట్టెలో ఉన్నాయి పట్టుచీరేల్లు అవిగోనె చెల్లెలా అరణంము నీకు
దండెం పై ఉన్నాయి అంచు చీరేల్లు అవిగోనె చెల్లెలా అరణంము నీకు
అంగట్లో ఉన్నాయి అంచు కంచాలు అవిగోనె చెల్లెలా అరణంము నీకు
గూటిలో ఉన్నాయి గిన్నె దొంతరలు అవిగోనె చెల్లెలా అరణంము నీకు
దంతపు పెట్టెల్లో నగలెన్నో కలవు అవిగోనె చెల్లెలా అరణంము నీకు
తూరుపున ఉన్నాయి చూడావుల మంద అవిగోనె చెల్లెలా అరణంము నీకు
పడమరని ఉన్నాయి పాడావుల మంద అవిగోనె చెల్లెలా అరణంము నీకు
దక్షిణాన ఉన్నాయి జమ్మావుల మంద అవిగోనె చెల్లెలా అరణంము నీకు
ఉత్తరాన ఉన్నాయి కర్రావుల మంద అవిగోనె చెల్లెలా అరణంము నీకు
చూరు ఆకు ఒకటి తుమ్పుకుని పొమ్మి దండేన కుళ్ళుగుడ్డ ఈడ్చుకుని పొమ్మి
ఇంటిదూలం ఒకటి ఈడ్చుకుని పొమ్మి చూసావా అన్నయ్య వదిన మాటల్లు
ఈసు ఉన్నదాని మాటేమీ మాట పదవే చెల్లెలా పంపి వస్తాను
ముందుగా వెళ్ళింది చూడావుల మంద ఆవెనుక వెళ్ళింది పాడావుల మంద
ఆవెనుక వెళ్ళింది జమ్మావుల మంద ఆవెనుక వెళ్ళింది కర్రావుల మంద
ఆవెనుక కదిలింది శ్రీకృష్ణ రధము ఆవెనుక వెళ్ళింది సుభద్ర సారె
శ్రీకృష్ణాయ నమో నమః

No comments:
Post a Comment