Friday, 6 February 2015

                                             ఓం  శ్రీ మహగణపతయేనమహ   శ్రీ విశ్వరూపం                                                   భారతాసేనల్లు పన్నినా నాడు పరమాత్ముని ముఖము చూచి పార్డుండు పలికే
విల్లూనుకోనితాను విజయుండు పలికే సేనల్లలో ఉన్న చేలువుండు పలికే
సేన మధ్యామందు స్వేతవాహనుడ ఖిన్నుడైపలికేను కిరీటే తానూ
కేశవా శ్రీకృష్ణ శ్రివాసుదేవా వామనుడ వైకుమ్థ మేలినా  స్వామి
అసురుల జంపిన జనార్దనుండ వెన్నుండ నాదొక్క విన్నపం దేవా
కృష్ణుడా నాదొక్క విన్నపం దేవా కృష్ణమ్మా నాదొక్క విన్నపం దేవా
ఏలేల వస్తువులు ఇల  పుచ్చరేమి పుత్రులు పుత్రులు భ్రాత్రులు ప్రజలు
కాదు మంచి చిన్నేలే కరుణ భీష్మూలు తోల్లైన జెప్పరె ద్రోణ భీష్మూలు
నిముషమ్ము క్షణమాత్రం నిలిపితే చాలు అక్రమము చెయ్యక వనములకు పోదు
తొంభై నూర్ల సంఖ్యవారు తుంగ క్షత్రియులు ఆరునూర్ల సంఖ్యవారు అయినజామ్బవులు
పదినూర్ల సంఖ్యవారు పట్టభాద్రూలు పన్నగా  పదకొండు అక్షౌహిణి  బలము
వేయి వేయి వేయి వేయి యుద్ధ రాజులును అతిరధులు మహారధులు అతిమహారధులు
అర్ధరదులా గొల్వ నేడెల్ల దేవా గురువుల వధియింప గోవింద వల్ల
కనక దయ సేయుమి గంగకి పోదు ఇందరు వగవగా ఈ యుధభూమి
వల్ల పొమ్మని పలికే ఉచితముగా తానూ బంధువులనెల్లను భంగమ్ముపరవ
రాజ్యంము నేవల్ల బావ శ్రీకృష్ణ పగడంపు వాచాన పలుకు శ్రీకృష్ణ
కర్పూర పలుకులు ఒప్పుతో తీరే మకరకుండలాలు మరి ఇంక మెరిసే
చిరునవ్వు తోడనే కృష్ణమ్మా పలికే ఎట్లెట్లు అర్జునా ఏమన్టివయ్య
వీరల్లు  మీచేత చచ్చేటివారా చచ్చేదివారనగా చంపేది నీవా
అస్వద్ధామనిఎటి మధుసూదనుండు వీరేల్ల మీచేత చచ్చేటివారా
ద్రోణుండు భీష్ముండు కృపాచార్యుండు వీరేల్ల మీచేత చచ్చేటివారా
కర్ణుండు మొదలైన వీరపురుశూలు వీరేల్ల మీచేత చచ్చేటివారా
చచ్చేదివారనగా చంపేది నీవా పోరగా నా ఎదుట శత్రువులు కలరా
విభవమ్ము నేనుసుమ వినవె కిరీటి మావల్ల మొహనస్తేజమును పొందు
రాజధర్మం నీకు చెప్పెను వినుమా తపసు నీకిమ్మనుట  ధర్మంము కాదు
అధర్మం చెయ్యమని చెప్పసుమి అయ్యా పోరి భూమిలోని శత్రువులనెల్ల
శత్రువుల క్షత్రియుల చంపి రాజ్యంము సాధించి విజయలక్ష్మి చేకొనవయ్య
వల్లపోమ్మని పలుక ఉచితమా నీకు అన్యుడనా నీకు అర్జునా దేవా
 అర్జునుడ అభిజేంద్ర భీభత్స విజయ ఫల్గునుడ పార్దుడా స్వేతవాహనుడా
పరాకు లేకుండా వినుమి అర్జునుడా చెప్పెను నా మహిమ చేకొని వినుమా
వ్రుక్షాలలోకేల్ల విశేషమైన అస్వద్ధవ్రుక్షమ్ము నేనే  కిరీటి
చేట్టులలోకేల్ల తేజమై ఉన్న శ్రికల్ప చేట్ట నగ  నేనేకిరీటి
తరువులలోకేల్ల సారాయమైన శ్రిగంధపు తరువనగా నేనే కిరీటి
వనములలోకేల్ల విశేషమైన బృందావనం నేను పృధివి అర్జునుడా
గీతల లోకెల్లా విశేషమైన భగవద్గీతను నేను పృధివి అర్జునుడా
వానరులలోకేల్ల విశేషమైన సుగ్రీవ వానరులు నేనే కిరీటి
సిమ్హాలలోకేల్ల విశేషమైన హనుమంతు సింహమ్ము నేనే కిరీటి
అశ్వా లలోకేల్ల విశేషమైన ఉచ్చైశ్రవమనియేటి తురగమ్ము నేను
గజములలోకేల్ల గారావమైన ఐ రావతమనియేటి  ఏనుగును నేను
ధేనువుల లోకెల్లా విశేషమైన కపిల ధేనువు నేను కవ్వారి వినుమా
నక్షత్రాలలోకేల్ల విశేషమైన పునర్వసు నక్షత్రం నేనే కిరీటి
పక్షులలోకేల్ల ప్రభౌన్న పెద్ద వైనతెయుదనేను వాసవార్జునుడా
ఆయనాలలోకేల్ల విశేషమైన ఉత్తరాయనమనగా నేనే కిరీటి
రుతువులలోకేల్ల విశేషమైన వసంతరుతువనగా నేనే కిరీటి
మాసాలలోకేల్ల విశేషమైన మార్గశిర మాసమ్ము నేనే కిరీటి
పక్షాలలోకేల్ల విశేషమైన శుక్లపక్షం నేను స్వేతవాహనుడా
వారాలలోకేల్ల విశేషమైన భానువారసప్తమి  నేనే కిరీటి
దినములలోకేల్ల విశేషమైన శ్రీ ఏకాదశి దినము నేనే కిరీటి
వ్రతములలోకేల్ల వాసికలిగున్న ద్వాదశి వ్రతమనగా నేనే కిరీటి
దానాలలోకేల్ల విశేషమైన అన్నదానం నేను అర్జునా వినుమా
ధాన్యాలలోకేల్ల విశేషమైన యవతిలలు గోధుమలు నేనే కిరీటి
చూర్నాలలోకేల్ల విశేషమైన శుద్ధ చూర్నమ్మనగా నేనే కిరీటి
పద్మాలలోకేల్ల విశేషమైన శంఖపద్మం నేను స్వేతవాహనుడా
పుష్పాలలోకేల్ల విశేషమైన గేజాన్గిపుష్పమ్ము నేనే కిరీటి
కార్యాలలోకేల్ల విశేషమైన ఉపకారం నేను ఉపకారి వినుమా
ఆయుదాలలోకేల్ల విశేషమైన వజ్రాయుధంమనగా నేనే కిరీటి
దేవలోకానికే ఇంద్రుడను నేను నాగాలోకానికే వాసుకిని నేను
దేవేంద్రుడు పట్టేటి వజ్రమ్ము నేను జమ్మివృక్షం నేను దనుజారి వినుమా
మహారుషులలోకేల్ల మంచివాడైన కపిలుడ ని చెప్పగా నేనే కిరీటి
గ్రీష్మ రుతువును నేను పృధివి అర్జునుడా వ్యాసుడను మహారుషిని నేనే కిరీటి
అమ్బరీషుడనగా అంతాను నేను బుదుదని చెప్పగా నేనే కిరీటి
మానసపుత్రులూ మరిబ్రహ్మరుషులు నారద మహామునీ నేనే కిరీటి
బ్రహ్మలోకం నుంచి ప్రార్ధించి తెచిన భాగీరధి అనియేటి తీర్థమ్మునేను
రాముదానేను శ్రీ రాముడిని నేను శ్రీ రాముడు పట్టేటి బాణమ్ము నేను
కృష్ణుడా నేను శ్రీ కృష్ణుడిని నేను శ్రీ కృష్ణుడు పట్టేటి  చక్రమ్ము నేను
వనములో తిరిగేటి సిన్గంము నేను ధరణిలో జాంబవ నేరేల్లు నేను
ఆయత్తుడానేను అగ్నిని నేను అష్ట పదులని  చెప్ప  అంతాను నేను
శ్రీలక్ష్మిని నేనుసుమ స్వేతవాహనుడా లక్ష్మికి పతియైన రాజుని నేను
కమ్మని పూవులా పరిమళంనేను మద్దెలలు మ్రోయగా ధ్వనియందు  నేను
భువిమీద పుష్కరాల తీర్థమ్ము నేను మహి మీద పారేటి మహా నదులు నేను
కొండలు నేను కుల పర్వతం నేను విస్తార జగమ్ము అంతాను నేను
మెట్టైన శ్రీ వారనాశిని నేను కాశి లో చేసేటి స్నానమ్ము నేను
గయలోన పెట్టేటి పిన్డంము నేను ప్రేతపర్వతముపై పితరులు నేను
కీర్తితో పెట్టేటి సత్రవులు నేను కర్తను నేను సుమ భోక్తను నేను
అక్షాయమగుచున్న ఆ వటము కింద అర్చించి పెట్టేటి అన్నమ్ము నేను
సప్త క్రతువులునేను జలనాధు నేను బ్రహ్మను నేను సుమ భగవంతుడిని నేను
శంభుడు నేను శ్రీ చంద్రుడిని నేను పదునాల్గు భువనాలు నేనే కిరీటి
జగమంతా యేలేటి జనకుడిని నేను భూసురుడనిఏటి బుధరాజు నేను
అనంత మవతార మనంత మహిమ అనంత రూపాన యశోదవాడ
కీర్తిగల అవతారమైన రాఘవులు చింతామణి అమ్బరీషులు పొగడ
సంతానవ్రుక్షమ్ము దనుజారి నేను గంగాయమునసరస్వతి సంగమం నేను
వేణు నాదం నేను వినుమి అర్జునుడా విశాలనేత్రుడిని విస్వేస్వరుడిని
వారనాశియండు శివుడిని నేను హరిద్వారమునన్దు ఆశ్రమం నేను
శ్రిసైలశిఖరంము శ్రీ కృష్ణవేణి గండకీనదులు మరి  గిరి గంగ నదులు
సిన్ధుకామనినదులు శ్రిగంగయందు వ్యాఖ్యానశాలలు వినిపించ నేను
గయాసురుడి శిరసు కాలను దాన్ని ఎద్దెక్కి నిలిచినా యగ్నేస్వరుడిని
ఋగ్వేదమునకు రూడ్హిగా నేను యజుర్వేదమునకు యజమాని నేను
సామవేదమునకు సర్వమునేను అధర్వణ వేదమునకు అంతాను నేను
సూత్రాలు నేత్రాలు చూడగానేను మేట్టుల్లు మేరుపర్వతంములు నేను
నాయందు పంచాభూతాత్ముడై ఉన్న యజ్ఞ పురుషుడా నేను యజ్ఞుడనేను
యజ్ఞపురోహితుడ యగ్నభుక్తుడ్ని యజ్ఞానికేల్లాను యజమాని నేను
బ్రహ్మయగ్న ధర్మ యగ్నంములోన పూర్నాహుతులుగొన్న పురుషోత్తముడిని
స్తలములు నేనుసుమ జలములు నేను కొలనులు పద్మాకరంములు నేను
సూదిమోపెపాటి చోటైన లేదు అఖిలాన్దబ్రహ్మాండ మంతాను  నేను
చూపిన చూడరే చోద్యంపు కనుల చేలువుడికిచ్చేనే తన దివ్యదృష్టి
త్రైలొక్య నాభులు తమచెలునికిచ్చే కృష్ణుడు విస్వరూపమంతాను చూపే
శంఖమ్ము ఒకచేత చక్రమొక చేత శారంగమొకచేత ఖడ్గామొకచేత
ఉభయమన్తమ్ములు శోభిల్లగాను తమనుంచి బ్రహ్మాండ భాండములు పుట్టె
నక్షత్రబంతులా నగవులు పుట్టే పిక్కల్లపుట్టినవి బిరుదులన్నియును
జానువులపుట్టినవి చతుర్యుగములును మదమలపుట్టినవి మనిశిగనముల్లు
ఉరమున ఉండెనే ఒప్పుతో లక్ష్మి కలియుగ వైకుంఠములు కన్థమున పుట్టే
నాలుకను పుట్టినవి అనంత వేదములు మిగత వస్తువులన్నీ వక్త్రమునపుట్టే
రోమరోమంమున బ్రహ్మాండము పుట్టే లోన ఉదయంపుట్టే లోకమంతాను
సజ్జనులు ముఖమున శూద్రులు మోకాళ్ల కడుమంచి బాహువుల క్షత్రియులు పుట్టే
సూర్యుడు ముఖమాయే సోముడు నాభి చలమొప్ప చిరుతొడల దేవతలు  పుట్టే
అష్ట దిక్పాలకుల కనే మెండుగాను మత్త గజములన్ని మకుటంములాయే
ఇంద్రుడు ఈశ్వరుడు ఇమ్మున బ్రహ్మ వాయువేగంమున వాచారిగనెను
గోలోక భూలోక పాతాళ లోక సత్యసువర్లోకముల అన్నింటిగనెను
వెలసిన శ్రీ విష్ణు లోకమ్ము గనెను మీరెల్ల  గనిరయ్య మీదే
ఇమ్మైన కొండలే ఇరుగాదల మెట్లు ఇంద్రుని నందన వనమపుడుగనేను
నందవసువుల మహా నగరమును గనెను యశోద బలభద్ర యాదవులగనెను
పురిటిలో పూతనను చంపినా ఠావు పుండరీకాక్షు పురుషోత్తముని గనెను
అన్న బలభాద్రుతో ఆడుతూ వచ్చి అటుకులకు చేయి చాపిన హస్తమునుగనెను
వెన్నబానోకచేత వేణువొకచేత వెదకుచూ కృష్ణమ్మా వీధుల్లనాడే
పాలబానోకచేత బాలుడొకచేత పరుగునవచెను పడతితో చెప్ప
తల్లితో చెప్పగా తరలించే రోళ్ళు మద్దుల గూల్చినా మాధవుల గనెను
మందలావులలోన మాధవులగానేను మందలో ఉన్న మధుసూదనుల గనెను
బకాసురునిజంపి బలిహారనముగా నీరుపోసిన ఠావు నిముషమునగానేను
దామెర్ల తలజుట్టి దామోదరూలు చలదులగలిపిన ఠావులే గనెను
మధురవాక్యంముల మితభాషనముల వేణు నాడంపట్టే వెయ్యివిధములను
వెన్నుండు వేణునాదం పట్టగాను వెలదులు వచిరా వెన్నుడిని చూడ
గోవిందుడు వేణునాదం పట్టగాను గోపికలు వచ్చిరా గోపాలుడిని చూడ
పద్మనాభుడు వేణునాదం పట్టగాను పడతులు వచ్చిరా బాలుడిని చూడ
పక్షులు వృక్షాలు మ్రుగజాతులన్నీ తమ దేహం మరచి సర్వేశు కనిరి
మెదలేట్టుకుని తమ మేతలు మాని హ కృష్ణ హ కృష్ణ హ కృష్ణ యనుచు
ఆవులు లేగలు కన్నులరమోడ్చి ఆయన్ని తలచేటి అచ్యుతుల గనెను
కుబ్జచే గంధమ్ము గొని దాని రూపు అతివల సౌన్దర్యమ్ మరి దానికొసగె
మదన సర్వేశ్వరుడ మరికావుమనగా సుదతి నిన్నుబోలు సుందరులు లేరే
నీయాన వచెను నమ్మి పొమ్మనెను చాణూర మల్లులా మదముననచెను
కంసుని జంపిన సర్వేశు గనెను ఉగ్రసేనుని పటన మొప్పుతొ  గనెను
తల్లికడ కేతెంచే త్రైలోక్య స్వామి మొక్కుచూ కౌగలించెడి ముద్దు గనెను
బలభద్రుడు పెండ్లాడె పడతి రేవతిని శుభముహూర్తం గనెను సొంపు తోడుతను
కళ్యాణ మూర్తులై కాడు  వేడ్క తోడ రుక్మిణి స్వయంవరం రూధితో గనెను
శిశుపాల దంతవక్త్ర సంహారం జరాసంధుడిని పట్టి చీరుట గనెను
కడలేని ద్రోనులే కరుణ భీష్మూలు కౌరవ సేనలు కవ్వారి గనెను
ఉత్తమాత్ముడైన అర్జునాదేవ ఉభయసేనల గనెను ఉభయ దిశలందు
శూన్యమై ఉన్నదా దుర్యోధనుల సేన ప్రభకలిగి ఉన్నదా పాండవుల సేన
పన్నంగా సేనల భువి రుద్రా పురుష ఎవ్వరు గానక అర్జునుడే అనెను
నిజవీరుడాయేనే నిజవంతుడాయే చూడలేక ఇంకా సోక్కితానుండే
లక్కగ్రుహం లోన రక్షిస్తిరయ్య నేడు రక్షించారే నీరజోదరుడా
ద్వారవతి ఇంటను ద్రౌపది మానమ్ము దయుంచి కాచితివి సభలోన మమ్ము
మా అపరాధాలు మా తప్పులన్నీ మన్నించి కావుమీ మధుసూదనుండా
కరుణించి కావుమీ గజరాజవరద పరీక్షించి కావుమీ ప్రహ్లాదవరద
అభయమీ శ్రీకృష్ణ అభయమీ నాకు అభయమీ దేవేంద్ర దేవకీ తనయ
ఇట్లుంట ఎరుగము ఈశ్వరా మిమ్ము నత్తమ్ము లాడితిని నాడు మీతోను
పాచికలాడితిని బావావని తలచి జోడుగుల్లాడితిని జోడువని తలచి
బొంకితిని మీతోడ బొంగారాలాడ కెందామరల వంటి అడుగుల స్వామి
కేశవా మూర్తి మీకు నమస్కారమయ్య అనగా రధము నుంచి రామకృష్ణులు
అర్జునుతోడ సల్లాపమాడుచును మేఘ వర్ణం మెరుపు మరి చాయమెరుపు
పైమీది పచ్చల పమిట జారింది పదిలముగా పట్టుకో బావ శ్రీ కృష్ణ
దనుజారి మాటలకు తనలోన నగుచు ధనము గంటినిసుమి దనుజారి అనెను
చంద్ర దర్శనమాయే చంద్రఫలమాయే తారాది ఫలముల ధరణి యెలెదవు
కులదీపకరుడవు కుంతిపుత్రుడవు హస్తినాపురా రాజ్య మంతా ను యేలు
అసురులకు వైరులకు అధికుడవైన అందు నిమిత్తంగా అవతార మూర్తి
మత్స్యమై వారధి జొచ్చి సోమకుని గొట్టి వేదము తెచ్చిన అచ్యుతా శరణు
తాంబేలు రూపాన ధర్మంము గాచి కూర్మావతారుడా గోవింద శరణు
నరసింహ రోఒపాన నఖముల చీరి పరగ వామనుడవై ధరణి నెలెదవు
జనకుల పంపున జనని వధియించి జమదగ్ని పరశురాముడు తానుసుమ్మి
హరినామమే అమ్రుతమ్మని జనులు భక్తీ సేవించి కాదు ముక్తి పొందెదరు
శ్రీ గోపికానాద శ్రీ గౌరినాధా నాధాధినాధుదా నందికేస్వరుడా
త్రైలోక్య పావన శ్రీశైల పాణి బానాదివాచక్ర బాణారివైరి
శుద్ధ లక్ష్మి విభుడ శ్రీ దివ్య మూర్తి అర్ధనారీస్వరుడా జమ్బుకేస్వరుడా
రెండు నాలుగు చేతుల రెండూల్లు పట్టి పాండురంగ దేవా వెండిగిరి ఈశ
అతిరధ జనకుద గజరాజ వరదా గజాసుర సంహార గజపుత్రనాద
గుర్రపు డెక్కల పోరాడు పృథ్వి వెరచి పోవకుమి వెనుక పారకుమీ
పుక్కిట తాంబూలం భోశనామ్గుల్యమ్ పెక్కు అందేలా దీప్తి మిక్కిలి ఛాయ
ఇంద్రనీల పూర్ణ మన్దరొధార చంద్రవదనా నీవు చంద్రాస్య ధరుడా
రావోయి అర్జునా రధముమీదికిని రణ భేరి వేయించే రామకృష్ణులు
కౌరవ సేనలు గజగజా వణకె ద్రోణుండు భీష్ముండు కృపాచార్యుండు
ద్రౌపదిని మనసున తలపోసి జూచి దుర్యోధనుని జూచి దుఖిన్చిరి వారు
కాలచక్రం పట్టి గడపరాదనిరి పీతాంబరం గట్టి విస్వేస్వరూలు
లక్ష్మిని ధరియించె నారాయణులు శంఖు చక్రమ్ముల చేతనే పట్టి
గాన్దీవధరుడు తన కవ్వారి మోసే హ రామరామనుచు వేయించే భేరి
హా సీతాపతి యని మోసే ధారల్లు శ్రీ రామరామనుచు వేయించే భేరి
సృష్టి రక్షకుడని మోసేదారల్లు కౌసల్య తనయుదని వేయించే భేరి
కాళింది మర్దనుదని మోసే ధారల్లు హనుమంత వరదుడని వేయించే భేరి
అయోధ్య వరదుడని మొసెధారల్లు సుగ్రీవ వరదుడని వేయించే భేరి
సూర్య వంశాజుదని మొసెధారల్లు విభీషణ వరదుడని వేయించే భేరి
వీరావతారుదని మొసెధారల్లు శాంతకు తమ్ముడని వేయించే భేరి
సేనరక్షకుదని మొసెధారల్లు అని శరణు ధారల్లు అష్టదిక్కులను
ఆనందపడిరిమరి విన్నవారంతా విభూతి తత్వమ్ము విశ్వరూపమ్ము
నిత్యమ్ము ఒకమారు పఠిన్చిరైన ఉత్తములు పుడుదురు ఒప్పుతోడుతను
రూపించాలేనట్టి రూపజననమ్ము మరియున్ను పుడుదురే మహోత్తములు
ఉభయగోదావరి నదీతీరాన కోటివేల గంగిగోవులను తెచ్చి
వెండికోమ్ములు భమిడి పురియలను పెట్టి సంపూర్ణ దక్షిణలు చాలగా పెట్టి
వేద ఉత్తముడైన పేద బ్రాహ్మడికి వాయన దానాలు వరుసతో చేసి
ఉద్యాపనంములు ఒప్పుతో చేసి దినదినము గోదానం చేసిన ఫలము
దినదినము భూదానం చేసిన ఫలము దినదినము కన్యాదానం చేసిన ఫలము
నవరత్న ఖచితాన కట్టినా పృథ్వి మరి వేద పాలకుల కిచిన ఫలము
దానికి దీనికి సమాన ఫలము తత్వార్ధమిదియని తప్పంగారాదు
శివ శరణు శివ శరణు శివ శరణు దేవా శివ శరణు శివ కాశి విశ్వపతి శరణు
భవ శరణు భవ శరణు భవ శరణు దేవా భవ శరణు భవాని శంకరుల శరణు
గురు శరణు గురు శరణు గురు శరణు దేవా గురు శరణు మాపాలి గోవింద శరణు
హర శరణు హర శరణు హర శరణు దేవా హర శరణు అర్ధనారీశ్వరుల శరణు
గంగ పాదమ్ములే గౌరి పాదములు కలకన్థు పాదాలు కరుణతో తలతు
ముగ్గురి పాదాలు ముక్తితో తలతు ముద్రియనే దలతు మోక్షమ్ము కలుగ
                   శ్రీ విశ్వరూప గానం శ్రీ కృ ష్ణా ర్ప ణమస్తు
         

No comments:

Post a Comment