శ్రీ కృష్ణుని చద్దులు
సృష్టిలో వెలసినట్టి శ్రివైష్ణవులెల్ల కూడి శ్రీకాంత వల్లభులను శ్రిమహిమలు విస్తరించే
వేడుక రెండే పదములు ఉభయ కారుణ్య వాడ కాళింది మర్దనునికి ఘనమైన కల్యాణములు
పంచాశాతకోటి యోజన విస్తీర్ణమైన పృథ్వి అంతా రక్షించావు రాజీవ లోచనుడ
చెన్నూగా గోపకుమాళ్ళు చేలకోలలు చేతపట్టి శ్రీకృష్ణ గోవులకాయ పోదామా ప్రొద్దున లేచి
గోవుల కాయ పోవాలె గోపకుమాళ్ళ తోటి గోవర్ధన గిరిధారుడా లేవయ్యా అనిరో ఇట్లు
అనుచు తన పట్టిని లేప ఆనందమున గోపెమ్మ అఖిలాండ నాయకులను అంకించి పిలిచెను తల్లి
సకల గుణ తేజుడ సకల గుణ రక్షకుడ పరంజ్యోతి తేజోనిలయుడా బలిజయుడ మేలుకొంటిరో
శ్రీ పరమ కళ్యాణుడ సృష్టికి కర్తవైన క్షీరాబ్ది శయనుడ వైన తనయూడ మేలుకొంటిరో
గ్రహచారమున కొలనున గజరాజు మకరికి చిక్కి గజరాజు కొలువ భక్తీ ఆలించి విన్న దేవా
ఆదివరహ శుభనిలయుడా ఆనంద యోగనిద్ర ఇన్దీవరానందుడ రఘునందన మేలుకొంటిరో
పూతన ప్రాణాపహార మాకెల్ల హృదయానంద శత్రు వర్గమ్ములు గడిపిన పుత్రుడా మేలుకొంటిరో
చాపధరుడు అర్జనుడు దిశలేల్ల త్రుంచివేసి ఆధారము లేనట్టైన పక్షంమున ఉండిరపుడు
కమల లోచానులు తమరు కరుణించి తలచి అపుడు గజరాజుని గాచిన కమల లోచనుడ మేలుకొంటిరో
పాంచాలి వలువలు సభలో దుశ్శాసనుడు వొలువ అక్షయ వలువలు ఒసగిన హరి కృష్ణ మేలుకొంటిరో
మత్స్యవతరమున జొచ్చి సోమకుని ద్రుంచి తేచి వేదమ్ముల నిచ్చిన మత్స్యావతార లెమ్మి
కూర్మావతారంమున కొండ వీపున నిలిపి అమరులకు అమృత మొసగిన కూర్మావతారా లెమ్మి
సప్త సముద్రాలన్నీ ధరణిపై కలసి పారగ వసుధ కొమ్మున ఎత్తిన వరహావతారుడా లెమ్మి
అదరి రక్కసుడు తమరు బెదరి స్తంభంముననుండి వెడలి హిరణ్యాక్షుని జీరిన సింహావతార లెమ్మి
బాల పప్రాయంమున మీరు బాలి చక్రవర్తి నపుడు మూడు పాదమ్ములు అడిగిన మురవైరి మేలుకొమ్మ
హలయుధంమున మీరు అన్ని తీర్థమ్ములు తిరిగి అవలీలగా ఏలినట్టి బలరామావతార లెమ్మి
వాలి మర్దానూడ వారాది బంధనూడ సుగ్రీవునకు హితుడవైన సుర్యత్మజుడా మేలుకొంటిరో
సేతు బంధనూడ శ్రీదేవి వల్లభూడ రావణ వైరివైన రఘురాముడ మేలుకొంటిరో
గోపికా నందనూడ గోవర్ధన వర్ధనూడ గోపకుల ప్రాణ విభుడా గోపాలుడ మేలుకొంటిరో
రుద్రూనికి త్రిపుర పురములు వేగ్గాలమాయనని ముద్దరాళ్ళ మనసును గొన్నబౌద్ధవతారుడ లెమ్మి
కాళీయ మర్దనూడ కౌస్తుభ హారధరుడా కలియుగాన దుష్టుల జంపిన కలికావతారుడా లెమ్మి
ఆదివరాహ శుభానిలయుడ ఆనంద యోగనిద్ర ఎప్పుడు మేలుకొండువు కూరిమితో గోపకుమాళ్ళు
అనుచు తిరుబోణము తెరచి చల్లరబోసేను చలది పాలశమ్ములు వేసి మృదువుగా కలిపెను చలది
ఓయమ్మా కలిపినా చలది ఒప్పార చిక్కమున ఉంచి పచ్చల్లన్ని చలది పై ఉంచెను తల్లి
ఓకాయ ఒద్దికాయ ఒప్పైన మారేడుకాయ ఊరిన అల్లము తోను ఉచ్చిన్తకాఎపెట్టే
నారికేళము పచ్చడి పెట్టె నారదబ్బ పల్లె పెట్టె ఊరిన పచ్చళ్ళతో ఉసిరికాయొప్పుగ పెట్టె
సల్లించిన మిరియపు గెలలు జమ్మావుల పెరుగు తోను మాగాయ ఆవకాయ అతి ప్రేమతో పెట్టెను తల్లి
కన్నయ్య లేవగా చూచి శ్రిపాదములు కడిగి ముద్దొప్పుచున్నట్టి ముఖపద్మము కడిగెను తల్లి
హరికి శ్రీ కున్తాయంములు తల దువ్వి పాపిడి తీసి గండుగా కొప్పె ముడిచి చామంతులు చంపకమ్ములు
చెంగల్వలు నడుమ చుట్టి జాజి కరవీర మల్లెలు అనేక పుష్పమ్ములు కృష్ణునకు ఉంచెను తల్లి
కాదు మేటి పాడంములకు గండు కదియాలే పెట్టి కనకంపు గజ్జెలు కట్టి ఘనమైన సొమ్ములు పెట్టి
మెరుగు మొల నూల్లే పెట్టి మేలిమైన సొమ్ములు పెట్టి ముద్రికాది అంగుల్యమ్ములు మురవైరికి పెట్టెను తల్లి
వజ్ర గోమేధిక పచ్చ వైదూర్య రత్నఖచిత సువర్ణ పతకములన్ని కృష్ణునకు ఉంచెను తల్లి
కదా లేని పచ్చ పట్టు బాగూగా దిండే తిప్పి భమిదె కటారే దోపి ప్రభుడు చేకోలలు పట్టే
గమకంముగా కోలలు పట్టి తొమ్మండుగురు వెంట రాగ బాగూగా మళ్ళీ చూచే బంగారము వంటి బిరుదు
ఒప్పి ఆనందమే చూసి ఒంటోన్టి రక్షలు తొడిగి నందుడి సుతుడు వెడలె మండల్ని గాతమనుచు
శ్లోకం: గోపాలరత్నం భువనైకరత్నం గోపాంగన యవ్వన భాగ్య రత్నం
శ్రిక్రిష్ణరత్నం సురమౌళి రత్నం భాజామహే యాదవ వంశ రత్నం
కోయిలలు కూసేది మ్రోత కోడిపుంజులు కూసేది మ్రోత కాన్తల్లు పాడేది మ్రోత చల్లాలు చిలికెడి మ్రోత
చిలకల్ల పలుకుల మ్రోత సద్గోవుల కొమ్ముల మ్రోత నెమళ్ళు కూసేది మ్రోత హంసల్ల నడకల మ్రోత
శ్లోకం: బాలయ నీల వపుషే నవ కిన్కినీక జాలాభిరాం జఘనాయ దిగంబరాయ
శార్దూల దివ్య నఖ భూషణ భూషితాయ నందాత్మజాయ నవనీత ముషే నమస్తే
నాల్గో ఝామాయెను ప్రొద్దు నాధుడికి విన్నపమ్ములు పొద్దున్నే కోడిపుంజులు పొలుపార కూయుచుండె
అనుకున్న గోపకుమాళ్ళు లక్ష యాభైవేలు ఉత్తి మూదేత్తుల మ్రోత ఉభయ పార్శ్వమ్ముల మ్రోత
ఏమి భాగ్యమ్ము కలదు ఈ మంద రాజ్యం వారికి త్రైలోక్య నాద పతికి తల్లి యశోదాదేవికి
సర్వేశుడు పాడిన వేణువు సంచారిమ్పుచునుండా శ్రీకారం తలచిన మ్రోతాశత యోజనంముల మ్రోత
అనుకున్న దేవగనంములు గగన మార్గమ్ము నుండి పుష్పంపు వృష్టి కురిసే పుండరీకాక్షుని మీద
శ్లోకం: కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి
గాంధర్వ యక్ష కిన్నెరా కింపురుష విద్యావతులు తుంబుర నారదూలు స్తుతియించి మిమ్ము కొలువ
చిట్టి చిట్టి లేగాలన్ని చెవులు నిక్కారింపుచు చేలువుడిని చేర వచ్చే శ్రీ వేణునాదం వినగా
చిక్కమ్ముల చద్ది దించి చొక్కంముగా వెండి గిన్నెలో అందండీ ముద్దలన్ని అగ్రజూడు అందించగా
అందరూ తామారగిస్తూ అందిస్తురు చలది ముద్దలు ఒందొంది పచ్చల్లన్ని ఉంగరాలు ఎడమదోసి
పదునైన ముద్దలన్ని బాల చంద్రుడికిచ్చి చుట్టుముట్టే గోపకుమాళ్ళు మేలుగా ఒప్పే భక్తీ
ప్రాభాత సమయమప్పుడు భాస్కరుని ఉదయము కాగా బ్రహ్మాండ కోట్లు కదల ప్రభుడు చద్దరాగించే
మధుసూదనుడు హస్తములను పన్నీట జలకమార్చి పరమాత్ముడు అవధరించే పచ్చిపోకలతోను పండుతెల్లనాకులతోను పచ్చాకర్పూరముతోను ఇంపైన తాంబూలంమును పరమాత్ముడు అవధరించే
అమరేంద్రాంగనలు తాము సంభ్రమంముతోడ రాగా ఆలంక మధ్యమందు భ్రమతులై చూచుచుండ
భ్రమతులై ఉన్నవారిని పంచశత కోతిని చూచి కల్ప వృక్షమ్ము నీడ కాదు చిన్న మంచే చూచి
కృష్ణుడు వేణువు పట్టే కాంతల చిత్తములదర మురవైరి వేణువు పట్టే అమ్భోజాక్షులు చూడ
సావేరి శ్రీరాగమున సరసిజ భూపాలమున సుస్వరంబున నాదం పట్టే సనకాదులు సన్నుతించ
పతులు తమ సతులను విడిచి సర్వేశుని కూడుకు రాగ సతులు తమ పతులను విడచి సర్వేషుని చూడ వచిరి
అందారు గొల్లలు కూడి ఆలోచన చేయుచునుండ కొందరు గొల్లలొచ్చి గోల పెట్టుచున
పెద్దవాడైన గొల్ల పెద్దరికంమున అడుగ కృష్ణుని సుందరిని నేనని సతినని అవ్వనిత పలికే
విన్న గోల్లవాదంతా పాపంపు మాటలేల సతినిచ్చే కష్టము కంటే చచ్చున్డుట మేలని పలికే
నిక్కంపు పరుడో గొల్ల బిరుదు పాటించి చూచి సతినైనా ఇస్తూను గాని చావంగానోప నేను
వివేక పరుడో గొల్ల బిరుదు పాటించి చూచి మనమేవ్వరు మనసతులేవ్వారు మధురాపురి కెగుదమనిరి
తల్లి తండ్రి కృష్ణుడు దాత దైవము గురుడు అచ్యుతుడు మనకందరికీ ఆత్మా బంధువుదని పలికే
కస్తూరి ఒక్క చెలియా కన్నుల కాటుక దిద్దే కాటుక ఒక్క చెలియా కలయంగా పూసుకు వచ్చే
వచ్చే ఒక చెలియా పేరులు గాచ్చార వేసుకోచే వచెను ఒక్క చెలియా తలను పేరులు తూగా
హారాలు ఊగుచునుండ కరివేరులు కురుల కదల జలజాక్షి కృష్ణుని చూచి నిలువు నిలువనితా పలికే
శ్లోకం: కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్తలే కౌస్తుభమ్ నాసాగ్రే నవమౌక్తికమ్ కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం కన్థెచ ముక్తావలీం గోపస్త్రీ పరివేస్థితో విజయతే గోపాల చూడామణి
కన్ను గీతుచు కృష్ణుడు నందన వనములకేగి కనక మండపము మీద కాంత రమ్మని తాపలికే
వస్తు వస్తు ననుచు రాధా మన పూర్వ జన్మ ఫలమున దొరికెనని పరుగున వనిత వచ్చే
శ్లోకం: మందార మూలే మదనాభిరామం బిమ్బాధరా పూరిత వేణు నాదం
గోగోప గోపి గోకుల పూర్ణ చంద్రం గోపం భజే శ్రీ కృష్ణం ముకుందం
వెన్నుని వేణు నాదం పాడిన విన్న వారికి సాయుజ్య పదవి కలుగు సంసార భీతి తొలగు
ప్రాభాత సమయమప్పుడు భాస్కరూని ఉదయం కాగా బ్రహ్మాండ కోట్లు కదల ప్రభుని చలకోలల మహిమ
పాడిన విన్నవారికి సాయుజ్య పదవి కలుగు సంసార భీతి తొలగు విష్ణు లోకమ్ము కలుగు
సర్వం శ్రీ క్రిష్ణార్పణమస్తు

No comments:
Post a Comment