Friday, 16 September 2016

                                                శ్రీ  రామ మానస పూజ

శ్రీ రామా జయ రామా శ్రీకర శృంగార రామ మారామా రఘురామా మానస పూజలను గొనుమ!!
అఖిలామర మునినాయక ఆవాహనమిదో మీకు అఖిలలోక రక్షక సింహాసనమిదో మీకు !!శ్రీ !!
పాతక సంహరణ మీకు పాద్యమిదో పాదములకు అంతరాత్మ అమర వందిత అర్ఘ్యమిదో హస్తములకు !!శ్రీ !!
ఆదిమధ్యాంత రహిత ఆచమనంబిదో మీకు మధుసూదన మదనజనక మధుపర్కంబిదో మీకు !!శ్రీ!!
సతతదీనమందార స్నానమునకు జలమ్బిదో వ్రతఫల సంధాన శీల వస్త్ర యుగ్మమ్బిదో మీకు !!శ్రీ!!
యతిమునీంద్ర వేదవన్ద్య యజ్ఞోపవీతంబిదొ మీకు చతురానన జనకదేవ చందనంబిదో మీకు !!శ్రీ!!
పూతచరిత పురుషోత్తమ పుష్పదామంబిదో మీకు అతిదయాకర పతితపావన అగరుధూపంబిదో మీకు !!శ్రీ!!
కరుణాకర సుగుణసాంద్ర కర్పూరధూపంబిదో మీకు నరమృగావతార ధీర నైవేద్యంబిదో మీకు !!శ్రీ!!
దారుణ దారిద్య్ర హరణ తాంబూలంబిదో మీకు నీరజాసనాది వినుత నీరాజనమిదో మీకు !!శ్రీ!!
మారకోటి సుందరాంగ మంత్రపుష్పంబిదో మీకు పరమపురుష రామచంద్ర ప్రదక్షిణమ్బిదో మీకు !!శ్రీ!!
శ్యామసుందర షోడశోపచారములను స్వీకరించి కామేశ్వరిదాస వరద కరుణతోడ కైవల్యమిమ్ము !!శ్రీ!!







       

No comments:

Post a Comment