Monday, 31 May 2021

శ్రీ రామ నమస్కారములు.

 దండమొక్కటి నీకు దశరధ వరపుత్ర 

రెండు దండమ్ములు పుండరీక 

మూడు దండమ్ములు ముల్లోక పూజిత 

నాల్గు దండమ్ములు నళిననేత్ర 

ఐదు దండమ్ములు అమరేంద్ర వందిత 

పదియు దండమ్ములు పంకజాక్ష 

నూరు దండమ్ములు నుతజన పూజిత 

వేయి దండమ్ములు వేదవేద్య 

లక్ష దండమ్ములు పక్షి వాహనమీకు 

కోటి దండమ్ములు కోమలాంగ 

అనుచు ఈ రీతి ప్రార్ధింతు అనుదినంబు 

రామతారక దశరధ రామచంద్ర.






 

No comments:

Post a Comment